September 19, 2026
Oplus_131072

Oplus_131072

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేపడితే చర్యలు తప్పవు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్

సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పెద్దేముల్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు బుధవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో పెద్దేముల్ పోలీసులు రుక్మాపూర్ గ్రామంలో పికెట్ (తనిఖీలు) నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న TS15UC8250 నంబర్ గల ట్రాక్టర్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇసుక రవాణాకు సంబంధించిన పత్రాలను చూపాలని డ్రైవర్ కుర్వ కిరణ్ కుమార్‌ను కోరగా, తన వద్ద ఎలాంటి అనుమతులు లేవని అంగీకరించాడు. దీంతో ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.