September 18, 2026

ప్రజా ప్రతినిధులు ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించాలి.- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

IMG-20260312-WA0037(1)

వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలీకార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు…

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అన్నారు..

అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేసి గ్రామాలు, పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నూతన ప్రజా ప్రతినిధులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తీవారి,ఎస్పీ స్నేహ మెహ్ర, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి గారితో పాటు పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.