బషీరాబాద్ మండల పరిధిలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ఎస్సై శ్రీశైలం యాదవ్ వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
బషీరాబాద్ మండలంలో ఇసుకసురులు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సై శ్రీశైలం యాదవ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టారు. బషీరాబాద్ మండలం దామర్చేడ్ తండాకు చెందిన ఇసుక ట్రాక్టర్లు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై శ్రీశైలం విధులు నిర్వహిస్తున్న సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని ఇసుకసురులు ట్రాక్టర్ తో ఢీకొట్టడం పట్ల పోలీసు యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. ఢీకొట్టిన రెండు ట్రాక్టర్లను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక రవాణాను కొనసాగించేదే లేదని, ఎవరైనా అక్రమ ఇసుకరా వల్ల కొనసాగిస్తే తనకు సమాచారం అందించాలని బషీరాబాద్ మండల ప్రజలను కోరారు.
