July 31, 2026

జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి… జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,

sp sneha mehra

 వికారాబాద్ జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీస్నేహ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు.  మంగళవారం  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా  మాట్లాడుతూ  జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారని తెలిపారు.  జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్  ఎస్.కె అన్వర్  పాషా  ఆధ్వర్యంలో  నిర్వహించిన ప్రత్యేకత నిఖీలలో గత వారం వ్యవధిలోనే 13 అక్రమ రవాణా కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.  యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్న 8  ట్రాక్టర్లు,  కరణ్ కోట్  పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కలప రవాణా చేస్తున్న ఒక లారీ పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.  నవాబ్ పెట్  పోలీస్ స్టేషన్ పరిధిలో   ఎర్ర మట్టి అక్రమ రవాణా చేస్తున్న మూడు లారీలను సీజ్ చేసి  కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.  వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణా కార్యకలాపాలను పూర్తిగా ప్రత్యేక దృష్టి సాధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.  జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పదంగా  అక్రమ రవాణా కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాత్రిపూట నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్రమంగా సహజ  వనరులను  తరలిస్తే  కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.  ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ అధికారులు జనవరి నెలలో 22  అక్రమ రవాణా కేసులు,  ఫిబ్రవరి నెలలో 9  అక్రమ రవాణా కేసులు,  మార్చి నెలలో ఇప్పటివరకు 20  ఈ మూడు నెలల్లో 51  అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా  ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలో శాంతిభద్రతల  పరిరక్షణ,  సహజ వనరుల సంరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.