ఈ నెల 31న పెద్దేముల్ ఎఫ్ఎస్సిఎస్ సర్వసభ్య సమావేశం
సంకల్పం పెద్దేముల్: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో ఈ నెల 31న ఉదయం 10:30 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ మురళీధర్ తెలిపారు. గత ఆరు నెలల జమా ఖర్చులు, రాబోయే ఏడాది బడ్జెట్ అంచనాలు, సిబ్బంది ఎక్స్‌గ్రేషియా వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారనీ, ఈ సమావేశానికి ఎస్బిఐ బ్యాంక్ అధికారులు సంబంధిత అధికారులు పాల్గొంటారని కావున సభ్యులందరూ తప్పక హాజరుకావాలని పెద్దేముల్ ఎఫ్ఎస్సిఎస్ రైతు సేవ సహకార సంఘం సీఈఓ జీ మురళీధర్ కోరారు.
