చింతామణి పట్నంలో ఏడు ఇళ్లల్లో చోరీ…. విచారణ చేపట్టిన పోలీసులు
తాండూర్ మండలం చింతామణిపట్నంలో రాత్రి ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. తాళం వేసిన ఇల్లే టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడు ఇళ్లలో చోరీ జరిగిందని బాధితులు తెలిపారు. గ్రామస్తులు కురువ చిన్న మల్లప్ప, కురువ పెద్దమల్లప్ప, కప్పలి లాలప్ప, గౌడి విజయమ్మ, హరిజన్ వెంకటమ్మ, డీకొండ లక్ష్మయ్య, గోవర్ధన్ రెడ్డి ఇళ్లల్లో చోరీ జరిగింది. కప్పలి లాలప్ప ఇంట్లో పట్ట గొలుసులు, గోవర్ధన్ రెడ్డి దగ్గర 7వేల రూపాయలు దొంగతనం అయినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయ సహకారాలతో విచారణ చేపట్టారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలో నలుగురి దొంగల చిత్రాలు రికార్డ్ అయినట్టు తెలిసింది.
