July 31, 2026

మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి

WhatsApp Image 2026-03-27 at 4.08.53 PM

ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో వేసవి  కాలంలో ఉన్న  ఎండతీవ్రతను ద్రుష్టి లో  ఉంచుకొని   తాండూరు పట్టణానికి వచ్చే ప్రయాణికులు, పాదచారులకు మజ్జిగ  కేంద్రాన్ని ప్రారంభించారు.  ప్రతి రోజు మధ్యానం  3 గంటలకు తాండూర్  బస్టాండ్  దగ్గర  మజ్జిగ అందుబాటులో ఉంటుందని  తాండూర్ మార్వాడి  యువ మంచ్ అద్యక్షులు కిషన్ రాథీ తెలిపారు.  నేటినుండి వచ్చే 40 రోజుల వరకు దాతల సహాయంతో మజ్జిగ కేంద్రాన్ని నడపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవి లో ప్రయాణికులకు పాదచారులకు, మజ్జిగ పంపిణీ చేయడం గొప్ప విషయం అని మానవ సేవ యే మాధవ సేవా అని  అన్నారు.  మార్వాడి యువ మంచ్ చేస్తున్న సేవ కార్యక్రమం లను కొనియాడారు.  ఈ కార్యక్రమంలో మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా , కార్యదర్శి వర్ష సార్డా,  కోశాధికారి కల్పన రాతి, మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, రోహిత్ అగర్వాల్, కరణ్ జైన్, భరత్, అనిల్ సార్డా. దినేష్ పర్థాని, అరుణ్ సార్డా. లక్ష్మి నారాయణ బూబ్. రమాకాంత్ పండిట్,  సన్నీ అగర్వాల్. సూర్య ప్రకాష్ సోమని,  నితిన్ సోమని,  సునిల్ సార్డా,  బ్రిజ్మోహన్ బూబ్, అభిషేక్ సార్డా తదితర సభ్యులు పాల్గొన్నారు.