July 31, 2026
Oplus_131072

Oplus_131072

సంకల్పం పెద్దేముల్: మద్యం మత్తులో కన్నతల్లిని, చెల్లెలిని వేధిస్తున్నాడన్న ఆవేశంతో ఓ కుమారుడు కన్నతండ్రినే గొడ్డలితో నరికి చంపిన ఘటన పెద్దేముల్ మండలంలోని బాయిమీది తండాలో చోటుచేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాథోడ్ లోక్య నాయక్ (50) మద్యానికి బానిసై తరచూ భార్య బిక్కి బాయిని, కుమార్తెను వేధించేవాడు. ఈ నెల 27న కూడా ఆయన భార్యపై దాడి చేయడంతో, ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు సునీల్ నాయక్ (34)కు ఫోన్ చేసి వాపోయింది. వెంటనే తండాకు చేరుకున్న సునీల్.. తండ్రి ప్రవర్తనపై నిలదీశాడు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో ఆవేశానికి లోనైన సునీల్, గొడ్డలితో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో లోక్య నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.