కురుమ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల నిధులు కేటాయింపు….
………కురుమ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల నిధులు కేటాయింపు
………. సంతోషం వ్యక్తం చేసిన కురుమ సంఘం నాయకులు
కురుమ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో కురుమ సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలో గల బీరప్ప దేవాలయం సమీపంలో కురుమ సంఘానికి కేటాయించిన స్థలంలో కురుమ భవన్ నిర్మించేందుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో కురుమ సంఘం భవన నిర్మాణం జరగనుందని అందుకు కృషిచేసిన ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డికి కురుమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు డివిజన్ కురువ సంఘం అధ్యక్షులు నాగారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కురుమ భవానికి నిధులను కేటాయించారని ఆయనకు తాము ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల కురుమ సంఘం అధ్యక్షులు జీనుగుర్తి నర్సింలు, పెద్దముల్ మండల కురుమ సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ, యాలాల మండల కురువ సంఘం నాయకులు మహిపాల్, తాండూరు పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు మరాఠీ నర్సింలు, హనుమయ్య, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్ వెంకటయ్య, తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు పూజారి మల్లప్ప, పెద్దముల్ మండల కురుమ సంఘం నాయకులు ఇందూరు బాలు, కందనెల్లి రాఘవేందర్, మల్లేశం, నర్సింలు, మల్లేపల్లి మిట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
