July 31, 2026

తాండూర్ నాపరాతి పరిశ్రమను మైనర్ మినరల్ గా పునర్ వర్గీకరించాలని కోరుతూ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేసిన వ్యాపారులు

vivek

తాండూర్ నాపరాతి పరిశ్రమను మైనర్ మినరల్ గా పునర్ వర్గీకరించాలని కోరుతూ  మంత్రి వివేక్  వెంకటస్వామికి వినతి పత్రం అందజేసిన వ్యాపారులు…..సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి  తాండూరు క్వారీ అండ్ స్టోన్ అసోసియేషన్ తాండూర్ స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ని కలిసి తమ సమస్యలను విన్నవించారు.  శనివారం హైదరాబాదులో గనులు భూగర్భ శాఖామంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామిని తాండూరు నాపరాతి పరిశ్రమ వ్యాపారులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తాండూరు నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమపై  సుమారు 30 వేల మంది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారని అలాంటి  నాపరాతి పరిశ్రమ  ఆగిపోతే పలువురు నష్టపోతారని మంత్రి గడ్డం  వివేక్  వెంకట్ స్వామి  దృష్టికి వ్యాపారస్తులు తీసుకువెళ్లారు.  తాండూర్ నాపరాతి పరిశ్రమను  మైనర్ మినరల్ గా పునర్ వర్గీకరించాలని కోరారు.  రాయల్టీ మరియు ఇతర చార్జీలను సవరించి సక్రమంగా నిర్ణయించాలని మంత్రిని కోరారు.  స్లాబ్ ఆధారిత  పాత  రాయల్టీ విధానాన్ని కొనసాగించాలని మంత్రిని వ్యాపారులు కోరారు. అందుకు మంత్రి గడ్డం  వివేక్ వెంకటస్వామి  తాండూరు ప్రాంత నాపరాతి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని  త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని మంత్రి తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్టోన్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రావూఫ్, నయీం (అఫ్ఫు),  ఉపాధ్యక్షులు ఓం  ప్రకాష్ సోమాని, అన్వర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జుబేర్  పాషా  తదితరులు పాల్గొన్నారు.