తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఇలాహి పెట్రోల్ బంక్ ముందు మున్సిపల్ ట్రాక్టర్లు, ఆటోలతో నిరసన చేపట్టారు. ఎన్నిసార్లు ఆస్తి పన్ను చెల్లించాలని తెలిపిన ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్లు ఆటోలతో పెట్రోల్ బంక్ చుట్టూ చేరి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నోటీసు ఇచ్చిన ఆస్తి పన్ను చెల్లించలేదని అందుకే నిరసన చేపట్టామని, ఇప్పటికీ ఆస్తి పన్ను చెల్లించకపోతే పెట్రోల్ బంకును సీజ్ చేయడం కూడా జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.