August 1, 2026

వికారాబాద్ జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీని ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్

WhatsApp Image 2026-04-02 at 1.11.03 AM

 వికారాబాద్ జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీని జిల్లా అధ్యక్షులు ధారాసింగ్ ప్రకటించారు.  జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా అనంతరెడ్డి,  కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఆనందం, అంజనేయ గౌడ్, శోభారాణి, నర్సిరెడ్డిల ఏడు మందిని  ప్రకటించారు, ప్రధాన కార్యదర్శిలుగా  గొట్టిముక్కుల శ్రీనివాస్, సిరాజుద్దీన్,  బి.అశోక్, రామచంద్రారెడ్డి, వెంకటయ్య, డి అశోక్,  సత్యమ్మ, మధుసూదన్ రెడ్డి, కావలి సంతోష్, హరీశ్వర్ రెడ్డి, బాబు సింగ్, వెంకటయ్య 11 మందిని ప్రకటించారు.  కోశాధికారిగా విశ్వనాథం రాఘవేందర్,  స్పోక్స్  పర్సన్స్ గా  ఆనంద్ గౌడ్, న్యాయవాది గోపాల్ ను ప్రకటించారు. కాగా కొందరు నాయకులు నూతన కాంగ్రెస్  కమిటీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని,  కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజులుగా  కష్టపడ్డామని,  ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఉన్న ప్రాధాన్యత తమకు దక్కలేదని కొందరు  కాంగ్రెస్ పార్టీ నాయకులు  తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వినికిడి.