ఘనంగా శ్రీ బాకారం ఆంజనేయ స్వామి రథోత్సవం…
ఘనంగా శ్రీ బాకారం ఆంజనేయ స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. గురువారం రాత్రి యాలాల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామ శివారులో వెలిసిన అత్యంత పురాతన పవిత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలను భక్తులు రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాలాల పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. శుక్రవారం జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు ఈ జాతరకు హాజీపూర్, కిష్టాపూర్,యాలాల, గోవింద్ రావు పేట్, విశ్వనాథ్ పూర్, గోరెపల్లి,నాగసముందర్ తదితర గ్రామాల భక్తులు ఆంజనేయస్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు తరలివచ్చారు. బాకారం హనుమాన్ జాతర సందర్భంగా భక్తులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.
