July 31, 2026

చెనిగేస్పూర్ గ్రామంలో అక్రమంగా కల్లును విక్రయిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గ్రామ సర్పంచ్ …స్పందించని ఎక్సైజ్ పోలీసులు

WhatsApp Image 2026-04-03 at 12.28.09 PM

చెనిగేస్పూర్  గ్రామంలో అక్రమంగా  కల్లును విక్రయించేందుకు వచ్చిన వాహనాన్ని గ్రామ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ అడ్డుకున్నారు.  మార్చ్ 30వ తేదీ వరకు  కల్లును తరలించడానికి ఒప్పందం  ఉందని తమ గ్రామంలో గీతా కార్మికులు చాలామంది ఉన్నారని అలాంటివారిని కాదని బయటి నుండి వచ్చే వ్యక్తులకు విక్రయించేందుకు తాము ఒప్పుకునేదే లేదని అన్నారు.  తమ గ్రామానికి అక్రమంగా కళ్ళు విక్రయించడానికి వచ్చిన వాహనాన్ని అడ్డుకున్నామని వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలని  ఎక్సైజ్  సిఐ కి ఫోన్లో  సర్పంచ్ ఫిర్యాదు చేశారు.  అరగంటలో  వస్తామన్న ఎక్సైజ్ పోలీసులు  మూడు గంటలైనా రాలేకపోయారు.  అంతేకాకుండా తనపై దాడి చేయడానికి చాలామంది ఇక్కడికి వచ్చారని కరణ్ కోర్ట్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పటికే   సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ అడ్డుకున్న వాహనం  కొందరు దౌర్జన్యంగా   అక్కడి నుండి తరలించారు.  ఈ సందర్భంగా ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ  కళ్ళు విక్రయించడానికి వచ్చిన వాహనాన్ని తాను అడ్డుకున్న దౌర్జన్యంగా వాహనాన్ని ఇక్కడి నుంచి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.  24 గంటల ముందు తాము నిర్వహిస్తున్న కళ్ళు దుకాణాన్ని ఆగమేఘాల మీద ఎక్సైజ్ పోలీసులు వచ్చి 30 పెట్టేలా కల్లును నీలమట్టం చేశారని,  అదే తనపై దౌర్జన్యం జరుగుతున్నదని ఈ వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలని మూడు గంటలుగా వేచించిన ఎక్సైజ్ అధికారులు తగిన న్యాయం చేయలేకపోయారని సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. , తనపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు.  తీసుకోవాలని, కళ్ళునివిక్రయించడానికి వచ్చిన వాహనాన్ని సీజ్ చేయాలని  చెనిగేస్పూర్ సర్పంచ్  ప్రవీణ్ గౌడ్, డిమాండ్ చేశారు.