తాండూర్ పట్టణంలో పేకాట ఆడుతున్న6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో బండి శ్యామ్, చందర్, నస్కంటి నరసింహులు, ఆలంపల్లి రాము, రాజు, తిరుపతి అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 3,050 రూపాయలను స్వాధీనం చేసుకొని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
