ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, ఏప్రిల్ 26:
తాండూరు పట్టణంలోని పురాతన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజా ప్రభుత్వంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరం” అని అన్నారు. ధర్మం, శాంతి మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచిన వాసవి మాత ఆశీస్సులు తాండూరు ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండటమే మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, తాండూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోట్రక కిరణ్, గుబ్బ ప్రగతి, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా, నగరేశ్వర దేవాలయం పాలకమండలి సభ్యులు సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నియోజకవర్గవ్యాప్తంగా అమ్మవారి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
