శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజా బల్ రెడ్డి గారు సోమవారం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న చైర్‌పర్సన్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆమె వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీ మల్లికార్జున స్వామి వారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేశారు.చైర్‌పర్సన్ దర్శనానంతరం చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ… తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆ మహాశివుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
