అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు…. మంతన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మంథన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్ అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనూష బాయ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. మంతన్ గౌడ్ గ్రామంలో యువకులు చెడు అలవాట్లకు పోకుండా ఉండాలా గ్రామస్తులందరూ చూడాలని కోరారు. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా క్రీడలపై దృష్టి సాధించాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మీబాయి, గ్రామపంచాయతీ కార్యదర్శి గోపాల్, పోలీస్ అధికారి నర్సింలు గ్రామ పెద్దలు యువకులు మహిళలు బారి సంఖ్యలో పాల్గొన్నారు
