మర్పల్లి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ శాసన మండలి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
మర్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి పాల్గొన్నారు. శనివారం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మరియు బుగ్గ రామేశ్వరం దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ పూజ కార్యక్రమంలో మనోహర్ రావు (అడ్వకేట్) రాష్ట్ర టీపీసీసీ ప్రచార కో ఆర్డినేటర్ కరణం పురుషోత్తం రావు, నీళ్లపల్లి సుధాకర్ రెడ్డి, పర్వత్పల్లి వెంకటయ్య, ఎంపీటీసీ రాజు, సర్పంచ్ నరేష్, మాజీ సర్పంచ్ బసంత్, చందర్ రెడ్డి, గొట్టిగ శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు బిర్కెట్ రఘు, అగ్గనుర్ సంకేత్, సిద్ధూ అయ్యా,రవి, గౌతమ్, మరియు తదితరులు పాల్గొన్నారు.
