అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నజిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు కుల్కచర్ల మండల కేంద్రంలో అంగడి ప్రదీప్ నివాసంలో ఉంచిన 38 బస్తాలు అనగా 1900 కిలోల రేషన్ బియ్యం, ముందుగా రవితేజ దుకాణంలో ఉంచిన 31 బస్తాలు అనగా 1550 కిలోల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ భాష ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం 34.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేసి నిందితులను కులక్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఒక ప్రకటనలు తెలిపారు.
