September 18, 2026

తాండూర్ చిలుకవాగు ప్రక్షాళన పనులకు అదనంగా రూ.30 కోట్లు….. ప్రభుత్వానికి చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి కృతజ్ఞతలు

ChatGPT Image Jul 27, 2026, 09_00_47 PM

తాండూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న చిలుకవాగు ప్రక్షాళన పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక అనుమతులను విడుదల చేసింది. ఈ సందర్భంగా తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి మాట్లాడుతూ, నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు, అలాగే నిధుల సాధనలో కీలక పాత్ర పోషించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిలుకవాగు  నిర్మాణ పనులు త్వరగా పూర్తి కావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, వారం రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చిలుక వాగు నిర్మాణానికి  అవసరాలను వివరించారని చెప్పారు. ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి విజ్ఞప్తికి ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.30 కోట్ల అదనపు నిధులకు ఆర్థిక అనుమతులు జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ అదనపు నిధులతో చిలుకవాగు ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమై, త్వరలోనే పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి  రానందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూర్ సమగ్ర అభివృద్ధికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.