July 30, 2026

తాండూర్‌లో అక్రమ కట్టడాలపై బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు.. కలెక్టర్‌కు వినతి

ChatGPT Image Jul 27, 2026, 09_19_52 PM

తాండూర్ పట్టణంలో కొనసాగుతున్న పలు అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు.బీజేపీ పట్టణ అధ్యక్షుడు నగరం మల్లేశం మాట్లాడుతూ, తాండూర్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం త్వరితగతిన స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.