July 30, 2026

ఒకేసారి మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు గుడ్ న్యూస్..! హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 1 నుంచి 15 వరకు పంపిణీ అవకాశం

WhatsApp Image 2026-07-27 at 10.08.41 PM

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. గోదాముల నుంచి వెంటనే రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.