జీవన్గీ మహాదేవ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
బషీరాబాద్, ఫిబ్రవరి 16 (సంకల్పం/ప్రతినిధి):
బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గీ గ్రామంలో వెలసిన శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాలయాన్ని తాండూరు శాసనసభ్యులు బి.మనోహర్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు కేశవరెడ్డి, మాణిక్ రెడ్డి, నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్ బసప్ప, మునిందర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వెంకటేష్ మహారాజ్, అజయ్ ప్రసాద్, శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి, కొనిగిరి నరసింహులు, గ్రామ పెద్దలు మరియు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
