ఇందిరమ్మ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు…
తాండూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో వార్డు నెంబర్ 8లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. మంగళవారం తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్యానెల్ న్యాయవాదులు మఠం చంద్రశేఖర్, జిలాని ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదని, ప్రజలందరికీ సమానమని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఇతర చట్ట వ్యతిరేక పనులు చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
