August 1, 2026

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

IMG-20260224-WA0501

మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చీఫ్ సూపర్డెంట్లు, మండల విద్యాధికారులు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ కోరారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి సమావేశ మందిరంలో విద్యాధికారులచే ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పదవ తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ప్రారంభం కానున్నాయని, ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ వారి హాల్ టికెట్లను సరిచూసుకోవాల్సిందని, పరీక్ష కేంద్రాలను ఒక్కరోజు ముందే సందర్శించి ప్రతిరోజు నిర్వహించే పరీక్షకు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థులు మరియు పరీక్షలను నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు, సెల్ఫో వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రానికి తీసుకురాకూడదని సూచించారు. పరీక్షా కేంద్రంలో మరియు పరిసరాల్లో సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పదవ తరగతి పరీక్షకు మొత్తం 13,579 మంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ తెలిపారు. ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ వ్యవహరించాలని, b పరీక్షలకు సంబంధం లేని వ్యక్తులు ఎవరిని కూడా పరీక్ష హాల్లోకి అనుమతించరాదని, మాస్ కాఫీగ్ కు అవకాశం ఇవ్వరాదని కలెక్టర్ కోరారు. పరీక్షా కేంద్రంలోనికి మొబైల్స్ వాచ్ ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్, త్రాగునీరు విద్యుత్తు సౌకర్యం, టాయిలెట్స్ ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. పదవ తరగతి పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసే ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, రామ్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.