September 18, 2026

పోచమ్మ దేవాలయానికి రేకుల షెడ్డును వేయించిన కురువ కిష్టప్ప

IMG-20260224-WA0559

పోచమ్మ దేవాలయానికి రేకుల షెడ్డును బిఆర్ఎస్ పార్టీ నాయకులు కురువ కిష్టప్ప వేయించారు. మంగళవారం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో గ్రామ దేవత పోచమ్మకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కురువ కిష్టప్ప తన సొంత డబ్బులతో దేవాలయానికి వచ్చే భక్తుల కోసం నిలువ నీడ కోసం రేకుల షెడ్డును వేయించారు. అనంతరం గ్రామస్తులు తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కురువ కిష్టప్ప దేవాలయం కోసం రేకుల షెడ్డు వేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల కార్యదర్శి కృష్ణ కుమార్, సీనియర్ నాయకులు వంగా శ్రీనివాస్ రెడ్డి, వెంకటప్ప, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కొల్ల మానెమ్మ గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.