రుక్మాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం: హాజరైన RBOL సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
పెద్దేముల్ సంకల్పం ప్రతినిధి: మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో తోపోజీ లక్ష్మీ-శేఖర్, ఇందిరమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతన గృహంలో అడుగుపెట్టిన యజమానులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి పాల్గొని నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. వీరితో పాటు సీనియర్ నాయకులు మంబాపూర్ శ్రీనివాస్ రెడ్డి, మంబాపూర్ మాజీ సర్పంచ్ శ్రవణ్, చంద్రయ్య, మైఫుజ్, హర్షవర్ధన్ రెడ్డి, కోటపల్లి బందయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. విందు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులతో రుక్మాపూర్ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
