July 31, 2026

భక్తుల కోరికలు నెరవేర్చే కొంగుబంగారం రాయికోడ్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి

భక్తుల కోరికలు నెరవేర్చే కొంగుబంగారం రాయికోడ్  శ్రీ వీరభద్రేశ్వర స్వామి

అత్యంత పవిత్రమైన రాయికోడ్  శ్రీ వీరభద్రేశ్వర స్వామి  భక్తితో  కొలిచిన భక్తులకు  ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని గట్టి నమ్మకం.   పల్లకి  సేవ, అగ్నిగుండం, కళ్యాణం, రథోత్సవం  అకార్యక్రమాల్లో రాయికోడ్  గ్రామస్తులతోపాటు సంగారెడ్డి జిల్లా భక్తులతో పాటు,  అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఆంధ్ర మూడు నాలుగు రాష్ట్రాల పరిధిలోని భక్తులు అత్యంత దూరంలో ఉన్న పట్టణాల నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. 

ఒకసారి స్వామివారి చరిత్రను  తెలుసుకుందాం….

ఏకశిలా పై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఉండడం  ఇక్కడి విశేషం.  అతి పురాతనమైన ఈ క్షేత్రం 14,15 వ  శతాబ్దం  మధ్యకాలం అనగా కాకతీయ విజయ నగర సామ్రాజ్యముల మధ్య కాలానికి చెందినది. విజయనగర సామ్రాజ్య శిల్ప రీతిలో గల ఈ విగ్రహాలు రాయలసీమ ప్రాంతం నుండి రాయకోడు మీదుగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి చెందిన భక్తులు వారి ప్రాంతానికి తరలిస్తుండగా ఒకరోజు రాత్రి చీకటి పడగా రాయికోడ్ లోని మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో సేద తీరారు. వారు తిరిగి బయలుదేరే సమయానికి విగ్రహం ఎంతకు కదలకపోవడంతో మరునాడు రాత్రి వారికి స్వామి వారు గజ్జల సవ్వడి గంటారావముల శబ్దములతో  అక్కడ ఉన్నవారికి గ్రామ పెద్దలకు దర్శనం ఇచ్చి ఇదే నాకు సరియైన పుణ్యక్షేత్రం నేను ఇక్కడే స్వయం ప్రతిష్టంగా వెలుగొందు తానని చెప్పాను. అందుకే నేటికీ కర్ణాటక మహారాష్ట్ర ప్రజల ఇలవేల్పుగా దేదీప్యమానంగా స్వామివారు వెలుగొందుతున్నారు. ఏకశిలా విగ్రహము 6.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కలిగిన శిలపై శ్రీ వీరభద్రేశ్వర స్వామి మరియు భద్రకాళి ఒకే శిలపై ఏ ఆధారం లేకుండా ఉన్న స్వామి అమ్మవారి శిలా సౌందర్యం వర్ణనాతీతం, సౌందర్యం,  అద్వితీయం,అమరం. ప్రచండ ప్రతాప, రుద్ర రుద్ర అవతార్డైన ఈ రాయికోడ్ వీరభద్రుడు ఉదయము సమయంలో బాల వీరభద్రునిగా, మధ్యాహ్న సమయంలో యువ వీరభద్రునిగా, సాయంత్రం వృద్ధ వీరభద్రునిగా నేటికి దర్శనమిస్తున్నారు. ఈనాటికి శ్రీ వీరభద్రుడు తన మహిమలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. భక్తులకు కలలో గజ్జల సభలు ఘంటారావములతో ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చుతూ కర్తవ్య నిర్వహణని తెలియజేస్తున్నాడు. శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి పేరున ముడుపులు మొక్కులు మొక్కిన వారు వారి అనుభవాలు నేటికీ భక్తులు వివరిస్తూనే ఉన్నారు. వారు వివరించిన భావముల సారము శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించిన పూజించిన స్మరించిన దీపారాధన చేసిన సకల ఐశ్వర్య ఆరోగ్యంలు కలుగును. దుష్ట గ్రహ దోషములు భూతప్రేత పిశాచాది భయములో తొలగిపోవును. ఇట్టి విషయంలో స్కంద పురాణంలో సైతం వివరించబడ్డాయి, మత్స్య పురాణంలో దేవి భాగవతంలో చెప్పిన విధంగా 108 శక్తి పీఠాలలో శ్రీ భద్రకాళి దేవి కూడా ఉండడం విశేషం. ఇటీవల శిథిలమైన గుండం ప్రాంతంలో నూతన గుండమును నిర్మించగా ఆ గుండెల్లోనికి జలధారలు తూర్పు దిశగా ఉన్న నీరు తీయగా దక్షిణ దిశగా ఉన్న నీరు ఉప్పుగాను ఉత్తరం దిక్కున ఉన్న నీరు చెప్పగానే ఉంటాయి. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం జాతర ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. ఓం శ్రీ వీరభద్రేశ్వరాయ నమః…